welcome to Akshararchana


info@akshararchana.com
+(91) 8977423823
A.P & T.S.- 10వ తరగతి తెలుగు ఉపవాచకం " రామాయణం కథాంశాలు" బాలకాండ || అయోధ్యాకాండ || అరణ్యకాండం || కిష్కింధాకాండ || సుందరకాండ || యుధ్ధకాండ AP 6వ తరగతి తెలుగు త్రిజట స్వప్నం పాఠ్యాశం || AP 6వ తరగతి " తెలుగు మేలుకొలుపు పాఠ్యాశం || AP 6వ తరగతి " తెలుగు సుభాషితాలు పాఠ్యాశం || AP 6వ తరగతి " తెలుగు "అమ్మఒడి" గేయం (దృశ్యరూపం) || AP 6వ తరగతి " "మాకొద్దీ తెల్లదొరతనము" || AP 6వ తరగతి " తెలుగు కవి పరిచయాలు || AP 7వ తరగతి " తెలుగు శిల్పి పాఠ్యాశం అన్నిపద్యాలు రాగయుక్తంగా || AP 7వ తరగతి " తెలుగు శ్రీలుపొంగిన జీవగడ్డ రాయప్రోలుసుబ్బారావు || AP 7వ తరగతి " "ఆలోచనం" ఆచల్లని సముద్రగర్భం || A.P 8వ తరగతి తెలుగు అన్ని పద్యాలు రాగయుక్తంగ || AP 8వ తరగతి " TELUGU LESSON 1 AMMA KOSAM AP 9వ తరగత తెలుగు కంఠస్థపద్యాలు రాగయుక్తంగా || AP 9వ తరగత తెలుగు తెలుగు పద్యరత్నాలు అన్ని పద్యాలు రాగయుక్తంగా || AP 9వ తరగత తెలుగు SIVA THANDAVAM || AP 9వ తరగత తెలుగు ప్రాజెక్టు పని || AP 10వ తరగతి తెలుగు అన్ని కంఠస్థపద్యాలు రాగయుక్తంగ || AP 10వ తరగతి తెలుగు మాణిక్యవీణ — కవి విద్వాన్ విశ్వం || AP 10వ తరగతి తెలుగు వెన్నెల పాఠ్యాంశంలోని అన్నిపద్యాలురాగయుక్తంగా

అక్షరార్చన కు స్వాగతం


నా పేరు జోస్యుల లక్ష్మీకాంత్. నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో తెలుగు పండితునిగా పనిచేసి 2021లో పదవీవిరమణ చేశాను . వృత్తితో పాటు పద్యాలు, పాటలు, కవితలు రాయడం ప్రవృత్తిగా చేస్తుంటాను. గతంలో నేను "తల్లిపాలభాష, శరణు శరణు " అనే సి.డిలు ఆవిష్కరించాను. ఈ పాటలు రాయడం ద్వారా వచ్చిన గుర్తింపు, ప్రోత్సాహం నన్ను ఈ వెబ్ సైట్ రూపొందించేందుకు దోహదపడింది. మన తెలుగుభాష, సంస్కృతుల గొప్పదనం నాకు తెలిసినంతవరకు అందరికీ తెలియజేయడానికి ఆలంబనయ్యింది. ఈ వెబ్ సైట్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సిలబస్ అనుసరించి 6 నుండి 10 తరగతుల వరకు గల తెలుగు, హిందీ ,సంస్కృతం పాఠ్యాంశాల సమగ్ర వివరణ , సాహిత్య, వ్యాకరణాంశాలు మరియు పండిత మిత్రులకు కావలసిన అదనపు సమాచారం పూర్తి ఉచితంగా అందించాలనే మాప్రయత్నాన్ని మనమిత్రులందరికి తెలియచేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాము .

aksharachana lakshmi kanth
josyula lakshmi kanth

I am a Retired Telugu Pandit. Alongside my academic work, I am a writer. As a lyricist my own album “TALLI PAALA BHASHA” with the tag line “VIDYA VISHAYAKA CHAITANYA GEETHALU” was a great success. This album won me many laurels and motivated me to continue my efforts to bring importance to Telugu literature and education.

On this website you can observe more about my research on Telugu language and the total syllabus of Andhra Pradesh and Telangana state Telugu from 6th to 10th classes and my writings. I hope you will find time to visit my website often. You can also subscribe to my Twitter feed or my YouTube channel by clicking the icons provided.

I would like to thank my CO-TEACHERS, WELL WISHERS and OLD STUDENTS for their generous support. Your contribution will help to develop and succeed in future endeavors.

తెలుగు పాఠ్యాంశాలు


our videos

what our people says

  1. డాIIతుమ్మలపల్లివాణీకుమారిగారు “అక్షరార్చన” నిజంగా అక్షరానికి అర్చనే! అందమైన చిత్రాలతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న సుప్రసిద్ధులైన ఆంధ్రకవుల పరిచయాలు, వ్యాకరణాంశాలు ఒకటేమిటి అన్నీ ఎంతో విజ్ఞానదాయకంగా ఉన్నాయి. అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు, తెలుగు భాషాభిమానులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉన్నది. తోటి ఉపాధ్యాయులకు ఈ అక్షరార్చన “కరదీపిక” అని నిస్సందేహంగా చెప్పవచ్చు. పాఠశాల స్ధాయిలోనే మాతృభాషాధ్యయనానికి గట్టి పునాది పడాలనే సంకల్పానికి అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ వెబ్సైట్ ఎంతో బాగుంది. జోస్యుల లక్ష్మీకాంత్ గారు చేస్తున్న కృషి ప్రశంసనీయం.
  2. పన్నూరు మాధవరెడ్డి జోస్యుల గారు మీ చేత సృష్టించబడిన అక్షరార్చన .కామ్ చాలాబాగుంది.6నుడి 10 తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ తెలుగు వాచకాలకు ,10వ తరగతి తెలంగాణా తెలుగు వాచకానికి అద్భుతమైన ప్రయత్నం చేశారు. ప్రతి పాఠానికి సంబంధించిన కవులచిత్రాలు ,నేపథ్యాలు ,ప్రక్రియలు ,ఉద్దేశాలు పిల్లలకు సులభంగా అర్థమై అందరిని ఉత్సాహ పరిచేవిగా ఉన్నాయి.చిత్రాలను చూడగానే కథ మొత్తం అర్థమయ్యే రీతిలో ఉన్నాయి. మూల్యాంకనానికి సంబంధించిన వ్యాకరణాంశాలలో పదజాలం ,వ్యాకరణాంశాలు ఇంకా రాలేదు కానీ మంచి ప్రయత్నం. లక్ష్యాత్మక ప్రశ్నలు చాలాబాగున్నాయి.మీ కృషి అభినందనీయం. అందుకే కష్టేఫలే అన్నారు. మీ కృషికి తప్పక ఫలితం ఉంటుంది.
  3. శ్రీమాన్ ఏ .వి .యస్ .యన్ ఆచార్యులు పండిత మిత్రులు శ్రీ జోస్యుల వారికి _ ఆర్య, మీరూ రూపాందించిన అక్షరార్చన వెబ్సైట్ విద్యార్థినీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కడు ఆచారణీయం, మార్గదర్శకము. మీ కృషికి అభినందనలు. హరిఃఓం
  4. తుమ్మల గిరిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ మీ అక్షరార్చన. కామ్ చూసాను చాలా బాగుంది. అందులో తెలుగు సబ్జక్ట్ కు సంబంధించిన అన్ని అంశాలను ఎంతో అర్ధవంతంగా పొందుపరచడం జరిగింది. చిత్రాలు ఎంతో సజీవంగా చక్కగా ఉన్నాయి. మీ కృషికి అభినందనలు. .
  5. మీ తులసీరావు , తెలుగు పండితులు బ్రహ్మశ్రీ జోస్యుల లక్ష్మీకాంతం గారికి నమస్కారాలు. మీప్రయత్నము వెన్నెల విహారాలుగా జనపదాలు తిరుగుతు మధురిమలు పొందుతూ మాణిక్య వీణ పలికించి జ్ఞాన భిక్ష ను పోంది గోరంతదీపమై ఉండి మీరుచే స్తున్న ఈ పని ఎందరో మిత్రులకు ఉపయోగపడగలవనిఅనుకుంటున్నా
  6. M.రవిచంద్ర కుమార్, ప్రధానకార్యదర్శి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆంధ్ర ప్రదేశ్. జోస్యుల వారికి నమస్సులు. మీ "అక్షరార్చన.కామ్" చూశాను. మన పండిత మిత్రులందరికీ ఇది ఎంతో ఉపయోగకరం. మీరు చేస్తున్న కృషి అద్భుతం. మీ పాఠ్యాంశ వీడియోలు అత్యద్భుతం. కాకపోతే ఒక విషయం మీరు రాష్ట్ర పండిత పరిషత్ బాధ్యులు. గతంలో లాగా మన సంఘానికి కూడా సేవలందించగలరని ఆశిస్తున్నాను.
  7. K శ్రీనివాసచారి, తెలుగు అధ్యాపకులు, కడప నమస్కారం గురువుగారు !! వెబ్సైట్ చూసాను. తెలుగు భాషను పునరుత్తేజింప జేయడానికి మీరు చేసిన ప్రయత్నం మిగుల ప్రశంసనీయం. పాశ్చాత్య సంస్కృతుల నీలినీడలు మన సంస్కృతులను కనుమరుగు చేస్తున్న రోజుల్లో మీప్రయత్నం బహుదా అభినందనీయం. భావితరాలు ఖచ్చితంగా మీకు ఋణపడి ఉంటాయి అని చెప్పగలను. తెలుగు తల్లి, భరతమాత ముద్దు బిడ్డలు మీరు.
  8. దాడి చంద్ర శేఖరరావు, తెలుగు భాషోపాధ్యాయుడు, తూర్పు గోదావరి జిల్లా. అక్షరార్చన వెబ్సైట్ రూపకర్త పూజ్యులు,గౌరవనీయులు శ్రీ జోస్యుల లక్ష్మీ కాంత్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతాభినందనలు. జోస్యుల వారి తెలుగు పాఠాల విశ్లేషణ మాతృ భాషోపాధ్యాయులకు స్ఫూర్తిదాయకం. జోస్యుల వారి స్పష్టమైన విషయ పరిజ్ఞానం అనితరసాధ్యం. ఓర్పు,నేర్పు కలగలసిన సాహిత్య తపస్వి శ్రీ జోస్యుల లక్ష్మీకాంత్ గారు. తెలుగు భాష పట్ల,సాహిత్యం పట్ల పాఠకులు, విద్యార్థులు,ఉపాధ్యాయులు అమితమైన ఆసక్తిని కనబర్చుటకు వీలుగా ఆయన చేస్తున్న అక్షరార్చన ప్రశంసనీయం. తెలుగు రాష్ట్రాలలో తెలుగు బోధనకు దిశా నిర్దేశం చేస్తూ భావి తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న జోస్యుల వారికి శత కోటి వందనాలు.ఆర్ధికంగా వ్యయ,ప్రయాసలు భరిస్తూ తెలుగు పాఠాల విశ్లేషణకు అందమైన రంగులద్దుతూ చూడ ముచ్చటగా విద్యార్థులను ఆకర్షిస్తున్న జోస్యుల వారి అక్షరార్చన అమోఘం...ఇంతటి మహాయజ్ఞాన్ని తలపెట్టిన జోస్యుల వారికి సదా కృతఙ్ఞులం.
  9. గంగాధర్ నాయుడు, తెలుగు పండితులు, కడప జిల్లా. తెలుగు ఉపాధ్యాయుడిగా దాదాపు 35 సంII అనుభవం, స్టేట్ రిసోర్స్ పర్సన్ గా,పాఠ్య పుస్తక రచయిత గా,ఉపాధ్యాయుల కరదీపికలను రూపొందించి,ప్రశ్నాపత్రాల రూపకల్పన లో మీ పాత్ర ఎనలేనిది.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పనిలో సాంకేతిక ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఆ సాంకేతికతను అందిపుచ్చుకుని మీరు రూపొందించిన అక్షరార్చన ప్రయత్నం అద్భుతంగా ఉంది.తెలుగు భాష పై మమకారం తో మీరు ఈ వెబ్సైట్ రూపొందించి తెలుగు ఉపాధ్యాయులకి,విద్యార్థుల కి విలువైన సమాచారాన్ని ఒకే చోట చిత్రాల రూపంలో,వీడియోలలో అందిస్తున్నారు.అలాగే pdf పుస్తకాలు కూడా ఈ వెబ్సైట్ లో అందించారు.అక్షరార్చన వెబ్సైట్ త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప స్థానాన్ని ,విద్యార్థుల, ఉపాధ్యాయుల మనసుల్లో చెరగని ముద్రను సొంతం చేసుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. మీ గొప్ప ప్రయత్నానికి అభినందనలతో, మిత్రుడు గంగాధర్ నాయుడు.
  10. కోన. పద్మావతి, తెలుగు శాఖాధ్యక్ష్యురాలు, విశాఖ వ్యాలీ పాఠశాల, విశాఖపట్నం. మాస్టారూ! మీరు చేసిన ప్రయత్నం భగీరథ ప్రయత్నం! తెలుగు భాషని, అందరికీ దగ్గర చేశారు. ఉపాధ్యాయులకు,కరదీపికగా,విద్యార్థులకు కరతలామలకంగా మలిచిన తీరు అత్యద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా రామాయణం ప్రాశస్త్యం, వివరణ చాలా చక్కగా ఉన్నాయి. కవి పరిచయాలు, కీలక భావనలు అన్నీ ఆ భాషామతల్లికి కూర్చిన సొబగులుగా అందరినీ అలరిస్తున్నాయి. మీరు చేసిన ఈ అక్షర యాగంలో కేవలం మీ శ్రమ ఒక్కటే పెట్టుబడి కాదు, ఆలోచన, సమయం, స్వవిషయలు కూడా పక్కనపెట్టిన త్యాగ వితరణ కూడా ఉంది. మీరు చేసిన ఈ యాగ ఫలం అందరికీ అక్షరామృత రూపంలో అందరికీ అందింది. అప్పటి వరకు తెలుగు విద్యార్థులకు దిశా నిర్దేశం ఇంత ప్రస్ఫుటంగా చేసిన వారు లేరు. మీరు చేసిన ఈ ప్రయత్నం అందరికీ ఓ వెలుగు దారి చూపింది అని నేను భావిస్తున్నాను. ధన్య వాదాలు.
  11. గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, తెలంగాణ. జోస్యులవారికి నమస్సులు.తెలుగు సబ్ఙక్టుకు మీరు ప్రత్యేకంగా రూపొందించిన "అక్షరార్చన.కామ్ " వెబ్ సైట్ చాలాబాగుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిలబస్ మాత్రమే ఉంది. తెలంగాణ పాఠ్యపుస్తకాల సిలబస్ ను కూడా వెబ్ సైట్ లో జోడిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని మా భావన. మీ కృషి వెలకట్టలేనిది. మరొక్క మారు అభినందనలు.
  12. మహ్మద్ అబ్దుల్లా,రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, తెలంగాణ. జోస్యుల లక్ష్శీకాంత్ గారూ అభినందనలు! "akshararchana.com" అనే మీ వెబ్ సైట్ చూసాము. ఇది విద్యార్థులకు మాత్రమే కాక ఉపాధ్యాయులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. తెలుగు పాఠ్యపుస్తక రచయితగా, స్టేట్ రిసోర్స్ పర్సన్ గా మీ అనుభవాన్ని రంగరించి రూపొందించిన ఈ వెబ్ సైట్ అభ్యాసకులకు, బోధకులకు అనువుగా ఉండి, పాఠాలలోని విశేష అంశాలను తెలియజేస్తుంది. వ్యాకరణాంశాలు,ఛందస్సు ఇంకా ఇతర పాఠ్యాంశాలు,తెలంగాణ తెలుగు సిలబస్ కూడా జతగూడితే పరిపూర్ణత వస్తుంది. మీ కృషి ప్రశంసనీయం.
  13. బి.గాయత్రి , పి.జి.టి. తెలుగు. ఇ.యం.ఆర్.యస్ , దోర్నాల, ప్రకాశం జిల్లా. "అక్షరార్చన.కామ్" తెలుగుభాషకు జీవంపోస్తూ, తెలుగు పండితులకూ, విద్యార్ధులందరికీ ఉపయోగకరమైన, విలువైన, ఆసక్తిని కలిగించే ఆకర్షణీయమైన వీడియోలు, చిత్రాలు మొదలైన బోధనోపకరణలతో అందరికీ తగు సూచనలిస్తూ, విరాజిల్లుతూ తేజోవంతులను చేస్తున్నది. అంతరిస్తున్న తెలుగుభాషకు చేయూతనిచ్చి , మీపంధాలో మరికొందరు నడయాడునట్లు చేసిన మీకు శుభాభినందనలు. తెలుగు బోధనోపకరణల రూపకల్పనలో మరెన్నో నూతన పోకడలకు జీవంపోయగలరని భావిస్తూ, అందరూ ఈ సేవలు ఉపయోగించుకోవాలని ఆశిస్తూ...మీ సోదరి.
  14. అగ్నిహోత్రం కిరణ్ వేంకట పవన్ కుమార్,తెలుగు పండితులు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,పిరాట్లంక, రేపల్లె మండలం, గుంటూరు జిల్లా. జోస్యుల లక్ష్శీకాంత్ గారూ నమస్కారం. తరగతుల వారీగా పిల్లల్లో భాషా సామర్థ్యాలు,విషయ అవగాహన మరింతగా పెంపొందించే విధంగా, వ్యాకరణాంశాలను కూడా సులభగ్రాహ్యం చేస్తూ, పాఠ్యాంశ సంబంధిత చిత్రాలను,కీలక భావనలను అందించి, పద్యాలు,గేయాలు పాడుకోవడానికి మార్గదర్శకములైన ఆడియో,వీడీయోలను అద్భుతంగా రూపొందించి, తెలుగు పాఠ్యాంశాలను విద్యార్థులకు కరతలామలకం చేస్తూ మీరు రూపొందించిన ఈ "అక్షరార్చన.కామ్" వేదిక విద్యార్థుల, ఉపాధ్యాయుల పాలిటి కామధేనువు అనటంలో అతిశయోక్తి లేదు.శుభం భూయాత్.

Follow and Subscribe Us on Social Media